Tuesday, December 25, 2018

10వ తరగతి విద్యార్థులకు సూచనలు In Physical Science Subject

10వ తరగతి విద్యార్థులకు సూచనలు In Physical Science





10వ తరగతి విద్యార్థులకు సూచనలు In Physical Science/2018/12/SSC-10th-class-instructions-to-students-in-physical-science-subject-to-get-good-marks.html



  1. *భౌతికశాస్త్రంలో ప్రతీ పాఠాన్ని క్షుణ్ణంగా చదివి అవగాహన పెంపొందించుకోవాలి. ఏ విషయాన్నీ బట్టీ పట్టకూడదు. భావనలు అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాలి. పాఠ్యాంశం చివర ఉండే ‘అభ్యాసాన్ని మెరుగుపరుచుకుందాం’లోని ప్రతీ ప్రశ్నకు సొంతంగా జవాబులు రాయాలి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి సరిగా ఉన్నాయా..? పరీక్షించుకోవాలి.*
  2. *>విజ్ఞానశాస్త్రంలో ప్రయోగాలకు ఆరు మార్కులు కేటాయించారు. ప్రయోగాలకు ఏ పరికరాలు ఎంపిక చేసుకోవాలి? ఎలా నిర్వహించాలి? ఏ అంశాలను పరిశీలించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. దీనికోసం మీరు రాసిన ప్రయోగ నివేదికలను చదవాలి.*
  3. * *సమాచార నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నల విషయానికొస్తే.. పట్టికలో సమాచారం ఇవ్వడం, బొమ్మలు ఇవ్వడం, వాటిని విశ్లేషించి రాసేలా ఇస్తారు. దీని కోసం పాఠ్యపుస్తకంలోని పట్టికలను విశ్లేషించండి. మీరు చేసిన ప్రాజెక్టులను చదవండి. దీనికి ఆరు మార్కులు కేటాయించారు.*
  4. *>బొమ్మలకు సంబంధించి నాలుగు మార్కులుంటాయి. పాఠ్యపుస్తంలోని బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించండి. బొమ్మలు గీయడం, భాగాలు గుర్తించడం, తప్పుగా ఇచ్చిన భాగాలు సరిచేయడం, మిగిలిన భాగం పూర్తి చేయడంవంటి అంశాలు అడగడం జరుగుతుంది.*
  5. * *పాఠ్యపుస్తకంలోని భావనలు నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి?, భావనల ఆధారంగా సమస్యలను సాధన చేయడమెలా? అని సాధన చేయాలి. వీటికి నాలుగు మార్కులున్నాయి.*
  6. *>పాఠ్యపుస్తకంలోని విషయాలను అవగాహన చేసుకుని ప్రతీ విషయాన్ని వివరించగలిగితే.. ఉదాహరణలు ఇవ్వగలిగితే 16 మార్కులు మీ సొంతమే.*