Tuesday, December 25, 2018

10వ తరగతి విద్యార్థులకు సూచనలు in Hindi Subject

10వ తరగతి విద్యార్థులకు సూచనలు in Hindi Subject





10వ తరగతి విద్యార్థులకు సూచనలు in Hindi Subject/2018/12/SSC-10th-class-instructions-to-students-in-hindi-subject-to-get-good-marks.html

  1. ద్వితీయ భాష హిందీ ప్రశ్నపత్రంలో ‘ఎ’ విభాగం 60 మార్కులు. ‘బి’ విభాగం 20 మార్కులుంటుంది. ‘ఎ’ విభాగం ప్రశ్నలు అయిదు బిట్లలో ఇస్తారు. ఈ బిట్లను సమగ్రంగా సాధన చేసి ఆకళింపు చేసుకొంటే మంచి మార్కులు సాధించొచ్చు. మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  2. నాలుగు పద్యపాఠాలు కవి పరిచయాలను సమగ్రంగా చదివితే 20 మార్కులు పొందొచ్చు. ఉపవాచకంలోని నాలుగు పాఠాల నుంచి 5 మార్కులు, గద్యపాఠాల నుంచి 15 మార్కులు సాధించవచ్చు. ‘బి’ విభాగంలో గద్య, పద్య పాఠ్యాంశాల వ్యాకరణాంశాలకు సంబంధించి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. పాఠ్యాంశ అభ్యాసాల్లో ఇచ్చిన వ్యాకరణాంశాలతో పాటు పాఠ్యాంశంలోని వ్యాకరణాంశాలను సాధన చేస్తే మంచి మార్కులు రాబట్టొచ్చు.
  3. 'ఎ’ విభాగం బిట్‌-1లో పఠన నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలుంటాయి. పఠిత గద్యం, అపఠిత గద్యం, పఠిత పద్యం, అపఠిత పద్యాలకు అయిదు చొప్పున మార్కులను కేటాయిస్తారు. ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో జవాబులు రాయాలి. పఠిత గద్యం విభాగంలో ఉపవాచక పాఠాలను బాగా చదివి ప్రతీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అపఠిత గద్యం విషయానికొస్తే వ్యాసరూప గద్యాంశాలను బాగా అభ్యాసం చేసి అవగాహన పెంచుకోవాలి. పఠిత పద్యంలో బరస్‌ తే బాదల్‌, మా ముజే ఆనే దే, కన్‌ కన్‌ క అధికారి పాఠ్యాంశాలపై దృష్టి సారించాలి. అపఠిత పద్యంలో ఆధునిక హిందీ సాహిత్యంలో సరళ పద్యాలను అభ్యాసం చేసి అవగాహన పెంచుకోవాలి.
  4. బిట్‌-2లో ప్రతీ ప్రశ్నకు నాలుగు మార్కులుంటాయి కాబట్టి 3-4 వాక్యాల్లో రాయాలి. చిన్న ప్రశ్నలను సాధన చేయాలి.
  5. బిట్‌-3లో పద్య పాఠానికి సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. 7మార్కులు కేటాయిస్తారు. బరస్‌తే బాదల్‌, మా ముజే ఆనే దే, కన్‌ కన్‌ క అధికారి, భక్తిపద్‌ పాఠాల సారాంశాల ఆధారంగా చేసుకొని ప్రశ్నకు 8-10 వాక్యాల్లో సమాధానం రాసేలా అభ్యాసం చేయాలి.
  6. బిట్‌-4 గద్య పాఠానికి సంబంధించినది. గద్య పాఠాల సారాంశాల ఆధారంగా అభ్యాసం చేయాలి.
  7. బిట్‌-5 సృజనాత్మకాంశాలతో కూడినది. పది మార్కులు కేటాయిస్తారు. మూడు ప్రశ్నల్లో రెండింటికి (5 మార్కుల చొప్పున) సమాధానాలు రాయాలి.
  8. లేఖ విషయంలో చుట్టీ పత్ర్‌, పితాజీ కో పత్ర్‌, మిత్ర్‌ కో పత్ర్‌లతో పాటు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పాఠశాల సంచాలకుడు, పురపాలక కమిషనర్‌.. తదితరులకు రాసే నమూనాలను అభ్యాసం చేయాలి.
  9. సాహితిక విధా, ఆత్మకథ, సంభాషణ్‌, సూచన, కరపత్ర్‌, సాక్షాత్కార్‌ సంబంధిత అంశాలను సాధన చేయాలి.