Saturday, October 27, 2018

AP DSC కోసం ఉచిత శిక్షణా తరగతులు

AP డిఎస్సీ కోసం ఉచిత శిక్షణా తరగతులు



   

 ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న ఆకాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్‌ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్‌సి నిర్వహించు గ్రూప్‌ -2, 3, 4, వీఆర్‌ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్‌-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 29నుంచి నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్‌ వారు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.

             రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 29న సోమవారం నాడు ఉదయం 9 గంటలకు శోభా హోటల్‌ పక్కన గల శ్రీ వెంకటేశ్వర  (యస్‌.వి) డిగ్రీ కాలేజిలో, బస్‌స్టాండ్‌ పక్కన గల చిన్మయ హైస్కూల్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పించబడను. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు కుమార్‌ తెలిపారు.
ap DSC TET cum TRT free coaching krishnamma Educational society /2018/10/ap-dsc-tet-cum-trt-free-coaching-krishnamma-educational-society.html


                 అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్‌ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్‌సైట్‌లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్‌ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందింస్తారు.


                 రెండవ బ్యాచ్‌ కోసం గ్రూప్స్‌ ఉద్యోగాలకు ఈ నెల 29న సోమవారం  తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు  28వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్‌, నేషనల్‌ జూనియర్‌ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్‌, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు.