Wednesday, January 18, 2017

Model Proceeding And Application Form for Child Care Leave to Women Govt Employees

Model Proceeding And Application Form for Child Care Leave to Women Govt Employees



Model Proceeding And Application Form for Child Care Leave to Women Govt Employees | Andhra Pradesh and Telangana Govts has sanctioned Child Care Leave for Women Government Employees | Download Model Application Form and proceeding to sanction that Child Care leave to Women Employees who are working in Govt of Telangana and Andhra Pradesh Departments | Download Application form for Child Care Leave | Download Model Proceeding to Sanction Child Care Leave child-care-leave-model-proceeding-and-application-form-download

Child Care leave Model Proceeding & Application Form Download


 👬 *చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు-సమాధానాలు:*👭


1.ప్రశ్న: 

*చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?*


*👉 సమాధానము:*

*G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.*


2. ప్రశ్న:

*చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?*


*👉 సమాధానము:*

*చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి. ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత DDO దే.*


3. ప్రశ్న:

*చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?*


*👉 సమాధానము:*

*వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు. కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు.*


4. ప్రశ్న:

*మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?*


*👉 సమాధానము:*

*చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual, spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.*


5. ప్రశ్న:

*సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?*


*👉 సమాధానము:*

*అర్హులే. 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.*


6. ప్రశ్న: 

*భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయవచ్చునా ?*


*👉 సమాధానము:*

*వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.*


7. ప్రశ్న:

*చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?*


*👉 సమాధానము:*

*అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.*


8. ప్రశ్న:

*పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?*


*👉 సమాధానము:*

*GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations,sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.*


 9. ప్రశ్న:

*చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?*


*👉సమాధానము:*

*వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.*