Search This Blog

Monday, March 14, 2016

Half a Day School Schedule in Telangana from 15th March-2025

 మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం.. మధ్యాహ్నం 1గం. నుండి 5గం .ల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

15 నుంచి ఒంటిపూట బడులు

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాస్ లు

ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వ హించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్ మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.

టైం టేబుల్ 8am-12:30pm

8am 1st bell

8:05 2nd bell

8:15-8:55 1st period

8:55-9:35 2nd period

9:35-10:15 3rd period

10:15-10:30 Break

10:30-11:10 4th Period

11:10-11:50. 5th period

11:50-12:30 6th period