*టెన్త్ మోడల్ పేపర్లు లేవ్*
*🔶బ్లూప్రింట్ కూడా రాలే 11 నుంచి 6 పేపర్లకు కుదించిన సర్కార్*
*🔷ఇప్పటికీ మోడల్ పేపర్లు రిలీజ్ చేయని ఎస్సీఈఆర్టీ*
*🔶పరీక్షలకు మరో మూడు నెలలే గడువు*
*🔷ఆందోళనలో ఐదు లక్షల మంది స్టూడెంట్లు రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేష న్, ఎస్సీఈఆర్టీ అధికారుల నిర్లక్ష్యంతో టెన్త్ స్టూ డెంట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లు కాకుండా ఆరు పేపర్లకు కుదించాలని సర్కారు గతంలో నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్ప టికీ దానికి అనుగుణంగా మోడల్ పేపర్లు గానీ, బ్లూప్రింట్ ను గానీ స్కూల్ ఎడ్యుకేషన్, ఎన్సీఈఆ ర్టీ అధికారులు రిలీజ్ చేయలేదు. దీంతో స్టూడెంట్ల తో పాటు టీచర్లు, పేరెంట్స్లోలోనూ అయోమయం నెలకొంది. అయితే పరీక్షలను ఆరు పేపర్లకు కు దించినట్లు ప్రభుత్వం అధికారికంగా జీవో ఇస్తేనే, మోడల్ పేపర్లు రిలీజ్ చేసే అవకాశం ఉందని అధి కారులు చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని మేనేజ్ మెంట్ల పరిధిలో ఏటా ఐదు లక్షలకు పైగా టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. ఈ ఏడాది కూడా ఇప్పటి కే 4.95 లక్షల మంది ఎగ్జామ్ ఫీజు చెల్లించారు. ప్రస్తుతం ఫైన్ తో ఫీజు చెల్లించే అవకాశం ఈనె లాఖరు వరకు ఉంది. మార్చి/ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ లెక్కన పరీక్షలకు మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంది. అయినా ఇప్పటికీ క్వశ్చన్ పేపర్ మోడల్ ను ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేయలేదు.అయితే సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 పరీక్ష లను ముందుగా ఆరు పేపర్లతోనే నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. కానీ ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణ యాన్న ఆలస్యంగా తీసుకోవడంతో, అప్పటికే ప్రతి యేడులాగే ఈసారి కూడా 11 పేపర్లు ఉంటాయని భావించిన జిల్లా అధికారులు పేపర్లను ప్రింట్ చేయించారు. దీంతో మళ్లీ పేపర్లు తయారుచేసి,ప్రింట్ చేయడం కష్టమని భావించి, చివరికి 11 పేపర్లతోనే ఎస్ఏ 1 పరీక్షలు నవంబర్లో నిర్వహించారు. దీంతో పబ్లిక్ పరీక్షల్లో వచ్చే పేపర్ ఎ మోడల్ లో ఉంటుందో స్టూడెంట్లు తెలుసుకునే చాన్స్ లేకుండా పోయింది. అప్పట్లో ఎస్సీ ఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో, త్వరలోనే బ్లూప్రింట్, మోడల్ పేపర్లు రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి రెండు నెలలు కావస్తు న్నా.. ఇప్పటికీ మోడల్ పేపర్లు విడుదల చేయలేదు. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.*
*💥ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలె*
*🌀మరోపక్క సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్, బయోలజీలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారా లేక ఒక్కటిగానే పెడ్తారన్న విషయంపైనా స్పష్టత లేదు. రెండు సబ్జె క్టులను వేర్వేరు టీచర్లు చెప్తుండడంతో వాల్యుయే షన్ వేర్వేరుగా నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై అధికారులు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే పేపర్ల కుదింపుపై సర్కారు జీవో ఇస్తేనే బ్లూప్రింట్, మోడల్ పేపర్లు రిలీజ్ చేయాలని అధికారులు భా విస్తున్నారు. వాటి ఆధారంగానే టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, సాధ్యమై నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని టీచర్లు, స్టూడెంట్లు కోరుతున్నారు.*
Click Here to Download TS SSC Exam Practice Papers
TS SSC 10th Class All Subjects Public Exams Model Practice Papers 2021
TS 10th Class Previous Years Practice Papers – Telangana SSC Important Question Papers | TS SSC/10th Class Model Papers | Download Telangana SSC/10th Public Exam Question Papers – All Subjects with Answers | Tenth Class Model Papers | TS 10th Class Model Papers All Subjects | TS/AP SSC Public Exams Previous Papers | Telangana 10th Question Papers | Telangana 10th Previous year Model Practice papers | SSC Model Question Paper for Telangana | | Telangana 10th Class/SSC Model Question Papers | Download PDF | TS SSC 10th (EM) Previous practice Papers Download | TS 10th Class Telugu Exam Questions Papers Download PDF; Telangana SSC Mathematics Exam Questions Papers Download | TS English Medium SSC/10th Class Model TS SSC 10th March (TM) Question Papers TS SSC 10th Class model question papers DownloadTelangana 10th Class Public Exams According to the Model Question Papers Released by the SCERT Telangana, Nature of Question Paper and allotted Marks as follow. Each Subject will have only one Paper not as before. Students will get more choice to choose Questions to write answers. Here is the Telangana SSC Public Examinations May'21 Exam PatternSSC PUBLIC EXAMINATION May 2021 - Question Paper PATTERN
Part A - 60 marks
Part B - 20 marks
PART - A
Section - I
6×2m = 12marks
Answer any SIX choosing THREE from each of the group ie A & B.
Group A - 6q
Group B - 6q
Section - II
4×4m = 16marks
Answer any FOUR out of EIGHT
Section - III
4×8m = 32 marks
Answer any FOUR choosing TWO from each of the group ie A & B.
Group A - 4q
Group B - 4q
PART - B
20×1m = 20 Marks
(20 Multiple choice questions)
Total = 80 Marks.
Telangana 10th Class Public Exams
According to the Model Question Papers Released by the SCERT Telangana, Nature of Question Paper and allotted Marks as follow. Each Subject will have only one Paper not as before. Students will get more choice to choose Questions to write answers. Here is the Telangana SSC Public Examinations May'21 Exam Pattern
SSC PUBLIC EXAMINATION May 2021 - Question Paper PATTERN
Part A - 60 marks
Part B - 20 marks
PART - A
Section - I
6×2m = 12marks
Answer any SIX choosing THREE from each of the group ie A & B.
Group A - 6q
Group B - 6q
Section - II
4×4m = 16marks
Answer any FOUR out of EIGHT
Section - III
4×8m = 32 marks
Answer any FOUR choosing TWO from each of the group ie A & B.
Group A - 4q
Group B - 4q
PART - B
20×1m = 20 Marks
(20 Multiple choice questions)
Total = 80 Marks.
TS 10th class Model Question Papers:
పదో తరగతిలో సగం ఛాయిస్
హిందీలో ఇంకా ఎక్కువ
ప్రశ్నలకు మార్కులు రెట్టింపు పరీక్షల నమూనా విడుదల
కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఛాయిస్ 50 శాతానికి పెంచారు. అంటే ఇచ్చిన ప్రశ్నల్లో సగం వదిలేసి మిగిలిన సగానికి మాత్రమే జవాబులు రాయాలి. హిందీలో ఆ ఛాయిస్ మరింత పెరిగింది. అందులో మూడు ప్రశ్నలిస్తే ఒకటి రాసేలా వెసులుబాటు కల్పించారు. పరీక్షల్లో ఒక్కో ప్రశ్నకు కేటాయించే మార్కులను కూడా ఈసారి రెట్టింపు చేశారు. పార్ట్-బిగా పిలిచే బహుళ ఐచ్ఛిక (మల్టిపుల్ ఛాయిస్) ప్రశ్నల్లో మాత్రం ఛాయిస్ లేదు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) శనివారం రాత్రి మాదిరి ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. వాటిని www.scert.telangana.gov.in వెబ్‌సైట్లో ఉంచింది.
ముఖ్య మార్పులు...
కేవలం 70 శాతం సిలబస్ మాత్రమే పరీక్షలకు ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది.
ప్రతి ప్రశ్నపత్రం పార్ట్-ఎ, పార్ట్-బిగా ఉంటుంది. సైన్స్‌లో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు పార్ట్-ఎకి 60 మార్కులు, పార్ట్-బికి 20 మార్కులు కేటాయించారు. పార్ట్-ఎలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో సగం ఛాయిస్ ఉంటుంది. అంటే నాలుగు ఇస్తే రెండు రాయాలి. ఆరు ఇస్తే మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక మార్కు ప్రశ్నలను రెండు మార్కులుగా, రెండు మార్కులవి నాలుగుగా, నాలుగువి ఎనిమిది మార్కుల ప్రశ్నలుగా మార్చారు.
పార్ట్-బిలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు అరమార్కు ఉండేది. ఇప్పుడు ఒక మార్కు కేటాయించారు.
ఆంగ్లంలో పాసేజీలను పాఠ్య పుస్తకం నుంచే ఇస్తారు. గ్రామర్‌కు ప్రాధాన్యం పెంచారని హైదరాబాద్‌కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఉమారాణి తెలిపారు.
సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులు ఉన్నందున వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇస్తారు. సమాధానాలు వేర్వేరు పత్రాలపై రాయాలి. ఒక్కో దానికి 40 మార్కులు. అందులో 30 మార్కులు పార్ట్-ఎ, 10 మార్కులు పార్ట్-బిలో ఉంటాయి.
ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో ఇదీ విధానం...
ప్రశ్నపత్రం 80 మార్కులు. 3.15 గంటల్లో సమాధానాలు రాయాలి.
పార్ట్-ఎలో 1, 2, 3 సెక్షన్లు ఉంటాయి.
సెక్షన్-1లో గ్రూప్-ఎ, గ్రూప్-బి అనే రెండు భాగాలుంటాయి. ప్రతి గ్రూపులో ఆరు ప్రశ్నలిస్తారు. అందులో మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
సెక్షన్-2లో మొత్తం ఎనిమిది ప్రశ్నలిస్తారు. ఏవైనా నాలుగింటికి సమాధానాలు రాయాలి. ప్రతి దానికి 4 మార్కులు.
సెక్షన్-3లో గ్రూప్-ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. ప్రతి గ్రూపులో ఇచ్చిన 4 ప్రశ్నల నుంచి ఏవైనా రెండింటికి జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
---------------------------------------------------------------------------------------------------------------------------
TS SSC Old Model Question Papers